పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : నారా లోకేష్ హామీ

పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆలూరు నియోజకవర్గం గుడిమిరాళ్ళ గ్రామంలో రైతులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. టమాటా పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. జగన్ చెప్పిన టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ హామీ నెరవేరలేదు. డ్రిప్ సబ్సిడీని రద్దు చేశారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

మా గ్రామంలో తుమ్మలచెరువు, నిమ్మలబండ చెరువు ఉన్నాయి. వాటికి నీరు ఇచ్చి, మా రైతులకు సాగునీరు అందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి రైతు రాజ్యం తెస్తానని చెప్పి రైతులేని రాజ్యంగా మారుస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు జగన్ ఉరితాళ్లు బిగిస్తున్నాడు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. సబ్సిడీపై డ్రిప్ ను రద్దు చేశారు. సబ్సిడీపై డ్రిప్ ఇస్తాం. టమోటా, ఉల్లిరైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటాం.పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చెరువులన్నింటికీ నీళ్లిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *