ఖాసింబీ కుటుంబానికి పరిహారం అందేలా కృషి చేస్తాం : నారా లోకేష్ హామీ

ఖాసింబీ కుటుంబానికి పరిహారం అందేలా కృషి చేస్తాం : నారా లోకేష్ హామీ

ఖాసింబీ కుటుంబానికి పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖ రాసి పరిహారం అందేలా కృషి చేస్తా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం కుప్పాల దొడ్డిలో చిరుమాను దొడ్డి గ్రామస్తురాలు ఖాంసింభీ యువనేత లోకేష్ ను కలిసి తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. నా భర్త రైతు కింజారి రంజన్ గత నెల 31న ఆత్మహత్య చేసుకున్నాడు.

గత రెండేళ్లుగా నకిలీ విత్తనాలు,పురుగుల మందులతో పంటనష్టం వచ్చింది. రూ.9లక్షలు అప్పుల పాలయ్యాం. వడ్డీలు కట్టలేని పరిస్థితి వచ్చింది. మానసిక ఒత్తిడి తో పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాకీ తీర్చాలని అప్పుల వాళ్లు మాపై ఒత్తిడి చేస్తున్నారు. కలెక్టర్ ను కలిసినా ప్రభుత్వం నుండి నేటికీ పరిహారం అందలేదు. మా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి సార్ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఆమె సమస్య పై నారా లోకేష్ సానుకూలం గా స్పందించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభం లో కూరుకు పోయింది. ఖాసింబీ కుటుంబమే ఇందుకు ఉదాహరణ. అస్తవ్యస్త విధానాల కారణంగా దేశం లో రైతు ఆత్మహత్యల్లో ఎపి 3వస్థానంలో ఉంది. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల తో తీవ్రంగా నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *