ఇంటింటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తాం : నారా లోకేష్ వెల్లడి

ఇంటింటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తాం : నారా లోకేష్ వెల్లడి

టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేస్తాం. డ్రైనేజిలు, సిసి రోడ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మిస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం కారుమంచి గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతోంది. చౌడమ్మ గుడి వద్దనున్న 200కుటుంబాల్లో ఒక్క ఇంటికీ కుళాయి లేదు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడ లేదు.

హైస్కూల్ వద్ద రోడ్డు సదుపాయం లేదు, ప్రహరీగోడ లేదు. నాయకులు, అధికారులకు సమస్యలపై విన్నవించినా ఫలితం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి అని విజ్ఞప్తి చేశారు.వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీరందించే నాధుడే కరువయ్యాడు. టీడీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైసీపీ వచ్చాక వాటా నిధులను చెల్లించలేక ఆ పథకాన్ని అటకెక్కించింది. కేంద్రం నిధులను వినియోగించడంలో విఫలమైంది అని లోకేష్ ఆరోపించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *