కిడ్నీ బాధితులకోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం : నారా లోకేష్ హామీ

కిడ్నీ బాధితులకోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే కిడ్నీవ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధునాతన వైద్యసౌకర్యాలతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శనివారం మైదుకూరులో శ్రీనివాసనగర్ లో నియోడజకవర్గంలోని కిడ్నీ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మైదుకూరు, పరిసరాల్లో కిడ్నీవ్యాధి బాధితులు అధికంగా ఉన్నాము. సరైన వైద్యసదుపాయం అందుబాటులోడ లేకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి దూరప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వం నుండి అందుతున్న ఆర్థిక సాయం మందులకు కూడా సరిపోవడం లేదు. కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పట్టణ ప్రాంత బాధితులకు చిరు వ్యాపారాలకు స్థలాలు కేటాయించాలి. కిడ్నీ బాధితుల పిల్లలకు ఉచిత విద్య అందించి ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. సురక్షితమైన తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంవల్లే కిడ్నీ రోగులు పెరుగుతున్నారు.

కిడ్నీవ్యాధి గ్రస్తులకు సరైన వైద్యసదుయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు రూ.1200 కోట్లు పెండింగ్ లో ఉంచడంతో ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో దూది, గాజుగుడ్డ వంటివి కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు చేపడతాం. కిడ్నీవ్యాధి బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం, మందులు అందించేలా ఏర్పాట్లు చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *