
రజకుల సమస్య పరిష్కరిస్తాం : జేసీ
- Ap political StoryNewsPolitics
- April 29, 2023
- No Comment
- 34
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఏటిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. పెన్నా నది సమీపంలో రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నదిలో రజకులకు వేసిన బోర్లు పనిచేయకపోవడం వల్ల మురుగునీటిలో బట్టలు ఉతుకుతున్న విషయం గమనించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే స్పందించి బోరు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.