వివేకా కేసులో ఏప్రిల్ 30 లోగా ఏం జరుగుతుందంటే..?

వివేకా కేసులో ఏప్రిల్ 30 లోగా ఏం జరుగుతుందంటే..?

వివేకా హత్య కేసులో తరువాత ఏం జరగబోతోంది..? సీబీఐ ఏం చేయబోతోంది..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవర్ని కదలించినా.. ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో విచారణను ఏప్రిల్ 30వ తేదీలోగా ముగించి.. అసలు కుట్రదారుల్ని వెలికి తీయాలని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చి.. కొత్త దర్యాప్తు బృందానికి బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ నెల మొదటి రెండు వారాలు సైలెంట్‌గా ఉన్న సీబీఐ.. ఇంటర్నల్ గా తన గ్రౌండ్ వర్క్ చేసుకుని తన జోరు పెంచింది. వరుస అరెస్టులతో వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది.

వాస్తవానికి ఏప్రిల్ 30 నాటికి సీబీఐ తన దర్యాప్తును కొలిక్కి తీసుకు వచ్చి… సుప్రీం కోర్టుకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. దీంతో..కీలక నిందితుల చుట్టూ ఉచ్చు బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్.. ఉదయ్ కుమార్ రెడ్డిని తొలుత సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల తారుమారు వెనక ప్రధాన పాత్రధారి అతడే అని సీబీఐ పేర్కొంది. ఆ తరువాత.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిపై ఫోకస్ పెట్టింది. వివేకా హత్యకు కుట్ర పన్నటం, హత్యకు ముందు పథక రచన చేయటం.. నిందితులతో సంప్రదింపులు జరపటం వంటి నేరాలన్నీ భాస్కర రెడ్డి చేశాడని పేర్కొంది. అంతే కాదు.. హత్య తరువాత ఆధారాలు చెరిపివేయటంలో కూడా భాస్కర రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఆయనను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచింది. ఉదయకుమార్ రెడ్డి, భాస్కర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇతర ముఖ్య నిందితులపై సీబీఐ ఫోకస్ పెడుతోంది.

ఈ క్రమంలో కీలక నిందితుడుగా ఉన్న కడప ఎంపీ అవానాష్ రెడ్డి వైపే అందరి చూపు మళ్ళుతోంది..? సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోగా సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా..? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ చేతికి చిక్కగా.. ఇక మిగిలింది అవినాష్ రెడ్డే కావటంతో ఆయన అరెస్టు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేపో.. మాపో ఆయనను సీబీఐ అరెస్టు చేయవచ్చని చెబుతున్నారు. మరోవైపు.. భాస్కర రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది. వారి నుంచి అదనపు సమాచారం రాబడతామని చెబుతోంది. సీబీఐ కస్టడీలో వారు నోరు విప్పితే.. తెర వెనుక సూత్రధారుల పేర్లు బయటకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే.. తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదలవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భాస్కర రెడ్డి అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్ రెడ్డి తన రాజకీయ సమావేశాలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే అనంతపురం జిల్లా పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు.. అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చి తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే.. ఆయన ఎంపీ కావటంతో ఓ నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తారని మరికొంత మంది అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో డిఫాక్టో బెయిల్ పై ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు పైనా కోర్టు తీర్పు రావాల్సి ఉంది. ఒకవేళ అతని బెయిల్ రద్దు అయితే.. గంగిరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనుంది. మొత్తం మీద.. వివేకా హత్య కేసులో కీలక నిందితులందరిపైనా సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఇక ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఒకటే మిగిలి ఉంది. గతంలో విచారణాధికారిగా ఉన్న రాంసింగ్.. భాస్కర రెడ్డి, అవినాష్ రెడ్డిలను అరెస్టు చేస్తాం అని చెప్పటం జరిగింది. సో అవినాష్ రెడ్డి అరెస్టు అనేది ఇక లాంఛనమే. అప్పుడు సీఎం జగన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతీ రెడ్డి కూడా చిక్కుల్లో పడతారని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య జరిగిన ఉదయం.. సంఘఠనా స్థలం నుంచి అవినాష్ రెడ్డి మొబైల్ నుంచి భారతీ రెడ్డి పీఏ మొబైల్ కు కాల్స్ వెళ్ళాయని సీబీఐ అంటోంది. ఇదే విషయంలో జగన్, భారతీరెడ్డి పీఏలను సీబీఐ ఇప్పటికే విచారించింది. సో.. ఈ కేసులో ఏప్రిల్ 30 లోగా అనేక అనూహ్య పరిణామాలకు ఈ కేసు వేదికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *