వివేకాను చంపింది ఎవరు?

వివేకాను చంపింది ఎవరు?

వివేకాది అత్యంత క్రూర పాశవిక హత్య

తరచి చూస్తే సందేహాలెన్నో

దర్యాప్తులో వెలుగుచూస్తున్న విస్తుపోయే వాస్తవాలు

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒంటరిపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె

టిడిపిపై అబద్ధపు రాతలకు ఇప్పుడేం సమాధానం చెబుతారు?

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించి, 2019 ఎన్నికలలో సానుభూతి ఓట్ల వర్షం కురిపించిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత క్రూరంగా పాశవికంగా జరిగిన వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వున్నది. వివేకాది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని నిర్ధారణ అయింది. దానికి కారకులు ఎవరు అనే విషయంపై సీబీఐ దర్యాప్తు సందర్భంగా కొంతమేర స్పష్టత వచ్చినప్పటికీ, దానిని ప్రేరేపించిన వారెవరు? వారి లక్ష్యం ఏమిటి అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే వివేకా రక్తచరిత్ర రాసిన ‘అసురుల’ గుట్టు సీబీఐ కొంతమేర రట్టు చేసింది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరుపుతున్న పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది. ఎన్నో అవమానాలు, ఆరోపణలు, అవహేళనలు ఎదుర్కొంటూ, చివరకు అత్యంత క్రూరంగా హతుడైన తన తండ్రి వ్యక్తిత్వ హననాన్ని సైతం పంటి బిగువున భరిస్తూ డాక్టర్ సునీత చేస్తున్న పోరాటం అద్వితీయం అని చెప్పవచ్చు. డాక్టర్ సునీత చేస్తున్న న్యాయపోరాటం ఎన్నో మౌలిక ప్రశ్నలను లేవనెత్తటంతో పాటు కొత్త ప్రామాణికాలు నెలకొల్పింది.

సందేహాలు ఎన్నో…

వివేకా ది దారుణ హత్య. ఆ సంఘటన చూసిన వారెవరికైనా అది అర్థమయ్యే అవకాశముంది. అటువంటప్పుడు అది గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శరీరంపై గాయాలు వున్నా రక్తపు వాంతులు చేసుకున్నట్టు ఎందుకు చెప్పారు? నేరం జరిగిన ప్రదేశంలో అక్కడి ఆనవాళ్లు చెదిరిపోకుండా చూడాల్సిన బాధ్యత వుంటుంది. అయితే అందుకు విరుద్ధంగా రక్తపు మరకలను తుడవడం, మృతదేహానికి కుట్లు వేయటం,వంటి సంఘటనలు ఎందుకు జరిగాయి? కుటుంబ సభ్యులు వచ్చే లోగా వివేకా మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? సంఘటనా స్థలం లో నేర ఆధారాలు లేకుండా చేయటం నేరమని బాధ్యతాయుత స్థానాలలో వున్న వారికి తెలియదా? సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు అధికారిని అక్కడి నుంచి బెదిరింపు ధోరణిలో ఎందుకు పంపించి వేశారు? అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నత స్థానాలలో వున్న వ్యక్తులకు సంబంధించిన వారితో ఆ సమయంలో ఫోన్ లో ఏ విషయాలు మాట్లాడారు? ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు, హత్య జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు ప్రస్తావించలేదు? తదితర అంశాలకు సంబంధించి దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చాల్సి ఉంది.

టిడిపిపై నిందలకు ఏం సమాధానం చెప్తారు?

వివేకా హత్య అనంతరం, దానిని అప్పుడు అధికారం లో వున్న తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు కు ఆపాదిస్తూ అధికార పార్టీ సొంత పత్రికలో అసత్య కథనాలు వండి వార్చారు. ఆ విధమైన కధనాలు ఎన్నికలలో సానుభూతి పొందేందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు అవన్నీ నిరాధారమని తేలిపోయింది. ప్రధాన నిందితుల వాంగ్మూలాలు, వివేకా వ్యక్తిత్వం పై చేస్తున్న ఆరోపణలు పరిశీలిస్తే టిడిపి లేదా దాని అధినేతకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టమవుతోంది. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? ఈ విధమైన అసత్య ప్రచారాన్ని రూపొందించింది ఎవరు? అందుకు ప్రేరేపించింది ఎవరు? ఇప్పుడు అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? దీనిపై స్పందించాల్సిన బాధ్యత అప్పట్లో ఆరోపణలు గుప్పించిన అధికారపార్టీ నాయకులు అందరిపైనా వుంది. వివేకా హత్య విషయంలో అధికార పార్టీ, దాని సొంత పత్రిక చేసిన మోసపూరిత, అబద్ధాల పుట్ట బద్దలయిన విధంగానే, కోడికత్తి కేసు సంఘటనలోనూ వాస్తవాలు బహిర్గతం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *