అవినాష్ అరెస్ట్ ను అడ్డుకుంటోన్న అదృశ్య శక్తులు ?

అవినాష్ అరెస్ట్ ను అడ్డుకుంటోన్న అదృశ్య శక్తులు ?

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి కీలక సూత్రధారి అని సీబీఐ భావిస్తోంది. వివేకా మృతిని గుండెపోటు డ్రామాగా చిత్రీకరించిన దగ్గర్నుంచి, ఆధారాలను ధ్వంసం చేయడం వరకు అన్నింటా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టంగా చెబుతోంది. రాజకీయ లబ్ధి కోసమే వివేకాహత్యకు అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని సీబీఐ ప్రాథమికంగా నిర్థారించింది. వివేకా హంతకులందరూ అవినాష్‌రెడ్డి ఇంట్లో సమావేశమైనట్టు గూగూల్‌ టేకవుట్‌ సాంకేతిక ఆధారాలు చూపడం, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఆ ఆధారాలను నిర్థారించడం సంచలనంగా మారింది. అయినా, సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి విషయంలో మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుల్లో వాదించిన సీబీఐ, అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వెనకాడుతోంది.

అటు అవినాష్ రెడ్డి తాను ఏ తప్పుచేయలేదని భావిస్తే, సీబీఐ విచారణకు ఎందుకు సహకరించడం లేదు? నోటీసులు ఇచ్చిన ప్రతీసారి అవినాష్ రెడ్డి తప్పించుకుంటున్నారంటే అర్థమేంటి? అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎంతోసేపు పట్టదు. కానీ, స్థానిక పోలీసులు సహకరించడం లేదని జిల్లా ఎస్పీని బతిమిలాడడం ఏమిటి? శాంతి భద్రతల సమస్య వస్తుందని ఎస్పీ సీబీఐకి చెప్పడమేంటి? అవినాష్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగానే సీబీఐ విచారణకు రాలేనని చెబుతున్న కారణాలు సహేతుకంగా కనిపించడం లేదు. నిజంగా ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంటే, కర్నూలులో కాకుండా హైదరాబాద్ తరలించేవారు. కానీ, కర్నూలులోనే ఎందుకు ఆగారు? మీడియాపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడడం? అవినాష్ రెడ్డి అనుచరులు ఆస్పత్రి వద్ద పెద్దసంఖ్యలో మోహరించడం దేనికి సంకేతాలు? ఓ ప్రజాప్రతినిథిగా తనపై ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత అవినాష్ రెడ్డిపై ఉంది. కానీ, ఆయన సీబీఐకి సహకరించకపోగా కుంటిసాకులతో విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనం రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే రీతిలో సాగుతున్న ఈ హైడ్రామాలో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు… తెరవెనక శక్తులు బలమైన ప్రయత్నాలే చేస్తున్నాయని తెలుస్తోంది.

అత్యవసర పనులున్నాయని ఓ సారి, తల్లి అనారోగ్యంగా ఉందని మరోసారి అవినాష్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టడం చూస్తుంటే…అరెస్ట్ భయంతోనే ఇదంతా చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అవినాష్ రెడ్డి గనుక అరెస్ట్ అయితే, ఆ కేసు తన మెడకు చుట్టుకుంటోందని భయపడిపోతున్నారట జగన్ రెడ్డి. వివేకాహత్య అనంతరం అవినాష్‌రెడ్డి చేసిన ఫోన్‌ కాల్స్‌ లిస్ట్‌లో సీఎం జగన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి కూడా ఉన్నారని సీబీఐ భావిస్తోంది. ఈ కాల్స్‌ లిస్టు గుట్టు కూడా సీబీఐ తేల్చనుంది. అందుకే, అవినాష్ రెడ్డి అరెస్ట్ ను కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి , ఆయన సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిలు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌తోనే విస్తృత కుట్ర కోణాన్ని వెలికితీయడం సాధ్యమని సీబీఐ భావిస్తోంది. ఈక్రమంలోనే అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ చేసి తీరతామని ఇప్పటికే సీబీఐ హైకోర్టులో స్పష్టం చేసింది కూడా. అయితే, అవినాష్ అరెస్ట్ పై హైడ్రామానే నడుస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *