కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదేనా..?

కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదేనా..?

కన్నడనాట రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరుతో కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. వచ్చే పది రోజులు అత్యంత కీలకంగా మారడంతో, ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. అధికారం తమదంటే తమదేనంటూ కాంగ్రెస్, కాషాయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రీపోల్ సర్వేలన్నీ కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఖాయమని ఢంకా బజాయిస్తున్నాయి. అన్ని సర్వేలు సంకీర్ణ సర్కార్ ఏర్పడబోతుందని చెబుతున్నాయి. దాంతో, జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ గా అవతరించనుందని తెలుస్తోంది. 2006, 2018లో హంగ్ ఏర్పడి కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి సీఎం అవడం ఖాయమనే ధీమాలో కుమారస్వామి ఉన్నారు.

అయితే, హైదరాబాద్ కు చెందిన ఆత్మసాక్షి సర్వే మాత్రం సంచలన గణాంకాలను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి అధికారం చేపడుతుందని అంచనా వేసింది. ఇటీవల విడుదల చేసిన ఫేజ్ వన్ సర్వేలో…బీజేపీ 65 నుండి 76, కాంగ్రెస్ 108 – 114, JDS 24 – 30, ఇతరులు 7 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. తాజాగా, ఫేజ్ టూ గణాంకాలను అంతకు మించి అన్నట్టుగా రిలీజ్ చేసింది. బీజేపీ 77-88, కాంగ్రెస్ 115-127, జేడీఎస్ 29-36, ఇతరులు 03-08 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది. బీజేపీకి 35శాతం ఓటింగ్ షేర్, కాంగ్రెస్ 41.5%, జేడీఎస్ 16.5%, ఇతరులకు 7% ఓట్లు పోల్ అవుతాయని పేర్కొంది.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే… మ్యాజిక్ మార్కు 113 దాటాలి. అయితే, ఆత్మసాక్షి మినహా వివిధ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వేల ప్రకారం చూస్తే…. అక్కడ ఏ పార్టీ కూడా మేజిక్ మార్క్ దాటే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో కర్నాటకలో బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇందులో జెడిఎస్ దక్షిణ కర్నాటక ప్రాంతంలో కొన్ని జిల్లాలకే పరిమితం కాగా…. కాంగ్రెస్, బిజెపి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. అయితే, ప్రీపోల్ సర్వేలు కాంగ్రెస్ బీజేపీలను కాస్త కంగారు పెడుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోదని, సర్వేలన్నీ చెబుతుండడంతో…. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఏవిదంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ది ఏషియానెట్‌-సువర్ణ న్యూస్‌ జన్‌కీ బాత్‌ , ది న్యూస్‌ ఫ్‌స్ట్-మాట్రిజ్‌, విస్తారా న్యూస్‌-సౌత్‌ ఫస్ట్‌ పీపుల్స్‌ పల్స్‌ సర్వేలు… కాంగ్రెస్ కన్నా బీజేపీకి అటు ఇటుగా కొద్దిగా ఎక్కువ స్థానాలు వస్తాయని తేల్చాయి. ఇక, ది సౌత్‌ ఫస్ట్‌ చేపట్టిన సర్వే లో బీజేపీ కన్నా కాంగ్రెస్ నాలుగు సీట్లు అదనంగా గెలుచుకుందని చెబుతోంది. కానీ, ఎక్కడా మ్యాజిక్ ఫిగర్ మాత్రం దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇక, టీవీ 9 సీఓటర్ సర్వే మాత్రం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. సర్వే అంచనాలు ఎలా ఉన్నా…రాష్ట్రంలో ఓటరు నాడి పసిగట్టలేక పార్టీలు కిందా మీద పడుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులంతా కర్నాటకలోనే మకాం వేశారు. దాంతో, వచ్చే పది రోజుల్లో ఓటరు నాడి ఏ మేరకు మారుతుంది అన్నది చర్చనీయాంశంగా కనిపిస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లోను మిశ్రమ ఫలితాలే రాగా కాంగ్రెస్, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని చీల్చి మరి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని నెలల పాటు క్యాంపు రాజకీయాలతో కొనసాగిన కర్ణాటక పాలిటిక్స్ అప్పట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాయి.సీన్ కట్ చేస్తే, ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న బిజెపి ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా…అటు కాంగ్రెస్ తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తోంది. కానీ, ఎవరికీ సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదన్న సర్వే ఫలితాలు…రెండు పార్టీలను కాస్త నిరాశ పరుస్తున్నాయి. ఈ పరిణామం జేడీఎస్ కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో కింగ్ అయ్యేది ఎవరు? కింగ్ మేకర్ గా నిలిచేందుకు కుమారస్వామికి ఏమేరకు అవకాశం వస్తుంది అనేది… మే 13 నాటి ఫలితంతో తేలిపోనుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *