
కేసుల నుంచి తప్పించుకునేందుకేనా జగన్ ఢిల్లీ టూర్..?
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 65
సీఎం జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం అవుతున్నారు. గత వారం బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే హడావుడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలసి వచ్చిన సీఎం జగన్ రెడ్డి, మరోసారి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మందకొడిగా జరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరో సీనియర్ సీబీఐ అధికారిని నియమించి కేసును వెంటనే తేల్చాలని సుప్రీంకోర్టు…. సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పెద్దల వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అక్రమ ఆస్తుల కేసులు, ఈడీ కేసులు, వివేకానందరెడ్డి మర్డర్ కేసుల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి…