
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి వైసీపీ కార్యకర్త సవాల్
- Ap political StoryNewsPolitics
- March 30, 2023
- No Comment
- 28
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వైసీపీ కార్యకర్త ప్రతి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోతే మీసం గీయించుకుంటానంటూ ప్రకాష్ రెడ్డి చేసిన సవాల్ కు వైసీపీ కార్యకర్త చేసిన ప్రతి సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం అభివృద్ధి చేశారని జనం మళ్లీ గెలిపిస్తారంటూ కోనపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త నాగరాజు ప్రశ్నించారు. నీ బచ్చాగాళ్లు, చెంచాగాళ్లు నియోజకవర్గంలో ఇష్టానుసారం చేస్తున్నారని నాగరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా మాట్లాడితే దాడి చేయడం, పోలీసులతో కొట్టించడమే మీకు తెలుసని ఎద్దేవా చేశారు.
రాప్తాడులో ప్రకాష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాను గుండు చేయించుకుంటానని, గెలవకపోతే ఎమ్మెల్యే గుండు కొట్టించుకోవాలంటూ నాగరాజు చేసిన వీడియో వైసీపీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. గ్రామ స్థాయిలో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఈ వీడియో కళ్లకు కడుతోంది..