
వరుస ఎన్ కౌంటర్లతో.. మాఫియాను మట్టిలో కలిపేస్తున్న “యోగి”
- NewsPolitics
- April 17, 2023
- No Comment
- 41
యూపీ కా షేర్…. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరస్తులు, గ్యాంగ్‌స్టర్ల పాలిట సింహస్వప్నంలా మారారు. మాఫియాను మట్టిలో కలిపేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, చెప్పినట్టే చేస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లతో గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మాఫియా గుండెల్లో నిద్రపోతూ, ఒక్కొక్కరిగా అరాచక శక్తులను ఏరిపారేస్తున్నారు. నేరస్థులను వెంటాడి.. వేటాడి తుదముట్టిస్తూ, రాష్ట్రంలో మాఫియాను శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నారు. . ” కాషాయ బాబా” దెబ్బకు కరడుగట్టిన క్రిమినల్స్ కూడా హడలిపోతున్ననారు. రాష్ట్రంలో గూండారాజ్ ను అంతం చేయడమే లక్ష్యంగా, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్. దాంతో, ఖాకీలు యోగి ఆదేశాలతో డాన్ లు, రౌడీలను ఎక్కడిక్కడ ఏరిపారేస్తూ ఈజీగా తమ పని కానిచ్చేస్తున్నారు.
ధర్మోరక్షతి, రక్షితహా అంటారు.. అంటే ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది… అన్న మాటలకు అక్షరసత్యం గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలుస్తున్నారు. ఓ సాధువులా జీవించే సామాన్యుడు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, నేరమయమైన యూపీని నేరరహితం చేస్తూ ముత్యంలా మారుస్తున్నారు. రాష్ట్రంలో హింసకు తావులేకుండా నేరచరిత్రను కూకటివేళ్లతో సహా పెకిలించేస్తున్నారు. నేరస్తులను వెంటాడి.. వేటాడి అంతమొందిస్తున్నారు. మాఫియా ముఠాలు, క్రిమినల్స్, గూండా, రౌడీల్లో ఏ ఒక్కరినీ ఉపేక్షించటంలేదు. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ దేశం హర్షిస్తోంది. యోగి లాంటి ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యోగి పట్ల ఆరాధనా భావం వ్యక్తం అవుతోంది. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే, భారతదేశ స్వరూపమే మారిపోతోందని అభిప్రాయ పడుతున్నారు.
ఇక.. 2017లో తొలిసారిగా సీఎం అయిన యోగి.. గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. అరాచకం రాజ్యమేలుతున్న యూపీలో.. నేరగాళ్ళ ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న నేరగాళ్ళకు.. తుపాకీ బుల్లెట్ తో సమాధానం చెబుతున్నారు.
యోగి ఆరేళ్ల పాలనలో 10వేలకు పైగా ఎన్‌కౌంటర్ కేసులు నమోదయ్యాయంటే.. యూపీలో నేరగాళ్ళ ఏరివేత ఏ స్థాయిలోజరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు. నేరగాళ్లు ఎక్కడ దాక్కున్నా.. వెతికి.. వెతికి.. వెంటాడి ఎన్ కౌంటర్ చేస్తున్నారు. వాడు గల్లీ రౌడీ అయినా.. స్టేట్ లెవెల్ గ్యాంగ్ స్టర్ అయినా.. బుల్లెట్ తోనే సమాధానం చెబుతున్నారు. ఇక.. యోగి ఆదిత్యనాద్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఎన్ కౌంటర్లలో ఇప్పటి వరకు 183 మంది హతం అయ్యారు. వీరిలో కరడుగట్టిన క్రిమినల్స్, రేపిస్టులే ఎక్కువ. 50 వేల మంది క్రిమినల్స్ ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా పోగేసుకున్న ఆస్తులను నిర్ధాక్షిణ్యంగా బుల్ డోజర్లతో కూలగొట్టించారు. క్రిమినల్ అనే పదం వినిపిస్తే.. ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారు యోగి ఆదిత్యనాద్. గూండా యాక్ట్ కింద ఈ ఆరేళ్లలో 23 వేల మందిని జైలుకు పంపారు. లొంగిపోయిన కొందరు అరెస్టు అయి జైలుకు వెళ్లగా, అడ్డంగా విర్రవీగిన వారు ఎన్‌కౌంటర్లలో అంతమయ్యారు. రౌడీల ఏరివేత కార్యక్రమంలో 1,443 మంది పోలీసులు గాయపడగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
మోస్ట్‌వాండెట్ క్రిమినల్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో యూపీలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్‌లన్నీ ఒక్కొక్కటిగా తోకముడిచాయి. ఆ ఎన్‌కౌంటర్ లెక్కలు చూసుకుని అయినా అతీక్ అహ్మద్ తగ్గలేదు. ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న న్యాయవాది ఉమేశ్‌పాల్ ను అతీక్, తన కొడుకు ద్వారా చంపించాడు. ఉమేశ్ పాల్ హత్యను సవాల్ గా తీసుకున్న యూపీ సీఎం, హంతకులను 50రోజుల్లో మట్టిలో కలిపేస్తానని అతీక్ కు వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన విధంగానే చేశారు. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా…తాజాగా అతీక్ అహ్మద్, ఆయన సోదరుడ్ని సైతం పోలీసుల సమక్షంలోనే గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. అతీక్ అహ్మద్ సామ్రాజాన్ని అంతం చేసిన యోగి సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రాగలిగిందంటే అందుకు యోగి మార్క్ పాలనే నిదర్శనంగా కనిపిస్తోంది. యోగిలాంటి సీఎం ఉంటే, ప్రజల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని పలువురు ప్రశంసిస్తున్నారు. యోగి ప్రధాని అయితే బాగుంటుందని, నేరరహిత దేశంగా తీర్చిదిద్దుతారని పలువురు కొనియాడుతున్నారు.