వివేకా హత్యపై ఆస్కార్ విన్నింగ్ యాక్షన్..!

వివేకా హత్యపై ఆస్కార్ విన్నింగ్ యాక్షన్..!

ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డి సొంత చిన్నాన్నవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గతంలో ఎంత సంచలనం సృష్టించిందో.. ఈ కేసులో కీలక నిందితులు అరెస్టు అవుతున్న తీరు కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది. నారాసుర రక్త చరిత్ర అంటూ ఆనాడు.. ప్రతిపక్ష టీడీపీకి రక్తపు మరకలు అంటించే ప్రయత్నాన్ని సీఎం జగన్.. ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు ఏ పాపం తెలియదంటూ జగన్ బ్రదర్స్ అమాయకత్వం నటించిన వైనాన్ని తాజా అరెస్ట్ ల సందర్భంగా అనేక మంది ప్రస్తావిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించారనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. దారుణ హత్యను సహజ మరణంగా చూపేందుకు ఆనాడు ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ రెడ్డి ఎన్ని అబద్దాలు చెప్పాలో అన్నీ చెప్పారని అంటున్నారు. అవినాష్ రెడ్డి మాటలు వింటే.. నిజంగానే సత్య హరిశ్చంద్రుని కజిన్ బ్రదర్‌ను చూస్తున్నట్టే నాడు అందరికీ అనిపించింది. కానీ.. తాజా పరిణామాలను బట్టి.. అవినాష్ ఆనాడు అమాయకత్వం నటించాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక.. వివేకా హత్య ఘటనపై నిండు అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన కూడా.. తెచ్చిపెట్టుకున్న బాధను ఒలకబోస్తూ.. తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు. “ఒక కన్ను.. మరో కన్నును ఎందుకు పొడుస్తుంది అధ్యక్షా..? అంటూ.. ఆనాడు ఆసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. ఎంతో సౌమ్యంగా.. ఆర్ద్రత నిండిన గొంతుతో జగన్ ఆనాడు చెప్పిన డైలాగ్స్.. మహా నటులకు సైతం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక్క అసెంబ్లీలోనే కాదు.. వివేకా మృతదేహం సాక్షిగా జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు వివేకాది సహజ మరణమా..? అసహజ మరణమా..? అనే విషయంపై ప్రపంచానికి పూర్తి క్లారిటీ రాకముందే.. జగన్ తనదైన స్టైల్లో జరిగిన ఘటనపై నెరేషన్ చేశారు. వివేకా హత్య ఎలా జరిగింది..? ఎంత మంది పాల్గొన్నారు..? గొడ్డలి పోటు ఎలా వేశారు..? మృతదేహాన్ని ఎలా తరలించారు..? వంటి విషయాలపై ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పలేని విధంగా ఆనాడు జగన్ వర్ణన కొనసాగింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న జగన్ రెడ్డి కళ్లకు కట్టినట్టు చెప్పటం.. నిజంగా అత్యద్భుతమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తం మీద.. వివేకా హత్య కేసులో ఇంటి దొంగల పాత్రే కీలకం అని ప్రస్తుతం సీబీఐ తేల్చింది. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆనాడు అమాయకత్వం నటిస్తూ మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్దాలని సీబీఐ తాజా అరెస్టులతో అర్ధం అవుతోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *