
అమరావతిలో ఇళ్ళ స్థలాల పేరిట జగన్ కుట్రలు
- Ap political StoryNewsPolitics
- May 26, 2023
- No Comment
- 33
నవ్యాంధ్రప్రదేశ్ కలల రాజధాని అమారవతిని స్మశానంతో.. ఎడారితో పోల్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట భారీ రాజకీయ జూదానికి తెర తీస్తోంది. అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు.. ఎక్కడి నుంచో పేదల ముసుగులో తీసుకొస్తున్న వారికి మద్య చిచ్చు రాజేసే కుట్రలకు పాల్పడుతోంది. రైతులకు నేటికీ ఫ్లాట్లు కేటాయించని జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిడ్కో ఇళ్ళను సైతం గాలికి వదిలేసింది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన జంగిల్ భూముల్లో సెంటు భూమి చొప్పున పేదలకు ఇస్తూ.. అమరావతి భివిష్యత్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి.. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా.. పేదలు, సామాన్యుల హౌసింగ్ కోసం ప్రత్యేకమైన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు ఏనాడో కేటాయించారు. అమరావతిలో వివిద నిర్మాణాలతో పాటు.. సుమారు 5 వేలకు పైగా ఫ్లాట్లతో టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని సైతం ఆయన చేపట్టారు. క్రుష్ణాయపాలెం గ్రామ సమీపంలో బహుళ అంతస్థుల భవనాల్లో.. అన్ని హంగులతో కూడిన టిడ్కో ఇళ్ళను చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది. 2019 లో ప్రభుత్వం మారే నాటికి దాదాపు 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి కూడా.
కానీ.. ఆ తరువాత వచ్చిన జగన్ రెడ్డి సర్కార్.. టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించింది. వాటిని లబ్ది దారులకు కేటాయిస్తే.. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని భావించిన జగన్ రెడ్డి.. టిడ్కో ఇళ్ళను పాడుపెట్టేశారు. ఆ పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగేలా వాటిని తయారు చేశారు. టిడ్కో ఇళ్ళనే కనుకు లబ్దిదారులకు కేటాయిస్తే ఇప్పటికి సుమారు 25 వేల మందికి పైగా అక్కడ భారీ కాలనీ ఏర్పాటయ్యేది. కానీ.. అలా చేయని జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ భూములను టార్గెట్ చేసింది. అక్కడ సెంటు స్థలం చొప్పున కేటాయిస్తూ.. స్థానికేతరులను అమరావతి భూముల్లోకి ఉసిగొల్పుతోంది.
రాజధాని రైతులు, స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుడా.. ఆర్ 5 జోన్ లో 25 లే అవుట్లను అధికారులు సిద్ధం చేశారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి.. హడావుడిగా ఒక్కొక్కరికి 48 గజాలను కేటాయించే కార్యక్రమం చేపడుతున్నారు. సరైన రోడ్లు… విద్యుత్ దీపాలు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే.. సెంటు భూములను పంచేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. కానీ.. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారిలో చాలా మందికి నేటికీ రిటర్న్స్ ఫ్లాట్లను ప్రభుత్వం కేటాయించలేదు. రిటర్న్స్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన ప్రాంతాల్లో అభివ్రుద్ధిని సైతం పట్టించుకోక పోవటంతో.. అవన్నీ అడవుల్ని తలపిస్తున్నాయి.
సీఆర్డీఏ లెక్కల ప్రకారం.. భూములు ఇచ్చిన రైతులకు 63 వేల 462 ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్రభుత్వం.. నేటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు.. పేదల కోసం కట్టిన టిడ్కో ఇళ్ళను సైతం కేటాయించలేదు. కానీ.. కొత్తగా సెంటు స్థలాలు అంటూ మరో జగన్నాటకానికి తెరతీశారు. అమరావతి రైతులకు, సెంటు స్థలాలు పొందిన లబ్దిదారులకు మధ్య గొడవలు పెట్టటం.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటమే లక్ష్యంగా.. జగన్ ఆడుతున్న ఈ వికృత రాజకీయ క్రీడపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.