విద్య రంగాన్ని నాశనం చేసిన జగన్ ?

విద్య రంగాన్ని నాశనం చేసిన జగన్ ?

ఏపీలో ఉన్నత విద్యారంగాన్ని జగన్ సర్కార్ ఓ క్రమపద్ధతిలో భ్రష్టుపట్టిస్తోంది. వైసీపీ శక్తులు కొన్ని విశ్వవిద్యాలయాల్లోకి చొరబడి ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. సంఘం వ్యతిరేక శక్తులకు కొన్ని సంస్థలు అడ్డాగా మారుతోన్నాయి. రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంటే, ఇక విద్యా ప్రమాణాలు ఎక్కడ మెరుగుపడతాయి. ఏపీలో ఉన్నత విద్యారంగం దుస్థితి ఏవిధంగా ఉందో…తాజాగా విడుదలైన NIRF ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకు పడిపోయింది.

NIRF ర్యాకింగ్స్ లో ఆంధ్రా యూనివర్శిటీ 76వ స్థానానికి పడిపోయింది. 2019లో 29వ స్థానంలో ఉన్న ఏయూ ఏటేటా అంచెలంచెలుగా పడిపోతూ 76వ స్థానానికి వచ్చేసింది. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ టాప్ 100లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. నాలుగేళ్లుగా యూనివర్శిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడం లేదు. విద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. డ్రగ్స్ కు అడ్డాగా కొన్ని సంస్థలు మారిపోతున్నాయి. విద్యారంగం నిధులన్నీ వైసీపీ ఖజానాకు మళ్లిస్తూ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా ఏటా వర్శిటీల ర్యాంక్ పడిపోతూనే ఉంది.

అయినా, జగన్ మాత్రం ఏపీలో విద్యారంగం అద్భుతమంటూ జబ్బలు చర్చుకుంటున్నారు. విద్యాప్రమాణాలు అంతగొప్పగా ఉంటే… ర్యాంకులు ఇంతలా ఎందుకు దిగజారాయో జగన్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష టీడీపీ సహా ప్రజలు నిలదీస్తున్నారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ ఉన్నత విద్యా రంగాన్ని ఓ క్రమపద్ధతిలో వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. టాప్ 100 పరిశోధనా సంస్థలలో ఏపీకి చెందిన ఒక్క సంస్థకి కూడా చోటు దక్కకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *