వివేకా కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ డైవర్షన్ పాలిటిక్స్

వివేకా కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ డైవర్షన్ పాలిటిక్స్

వివేకానందరెడ్డి హత్య కేసు సీఎం జగన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న వేళ.. ఆయన డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారా..? వ్యూహాత్మకంగా విశాఖ రాజధాని అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకు వచ్చారా..? సెప్టెంబర్‌లో విశాఖకు “కాపురం” మార్చేస్తానంటూ.. జగన్ ప్రకటించటం దేనికి సంకేతం? జగన్ “కాపురం” మార్చినంత మాత్రాన.. వైజాగ్ రాజధాని అయిపోతుందా..? కోర్టు‌లో కేసు ఓ కొలిక్కి రాకుండానే జగన్ కాపురం స్టేట్‌మెంట్లు ఇవ్వటం వెనుక వ్యూహం ఏంటి..?

డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో.. తనను మించిన వారెవరూ ఉండరనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ రెడ్డి మరోసారి నిరూపిస్తున్నారు. వ్యక్తిగతంగా తనకు.. లేదా ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైన ప్రతీసారీ ఆయన డైవర్షన్ పాలిటిక్స్‌నే ఎంచుకుంటారనే ముద్ర ఉంది. ఒక సమస్య నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. మరో కొత్త సమస్యను సృష్టించటం లేదా కొత్త వివాదాన్ని క్రియేట్ చేయటం వైసీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. గతంలో పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేపట్టినప్పు.. కొత్త జిల్లాల గురించి జగన్ ప్రకటన చేయటాన్ని దీనికో మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల వరకు జగన్ మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌నే బేస్ చేసుకుంటున్నారు. తాజాగా వివేకా హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఆయన.. మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు.

“కన్విన్స్ చేయలేక పోతే… కన్ఫ్యూజ్ చెయ్” ఇదే విషయాన్ని ఆది నుంచి జగన్ రెడ్డి అవలంభిస్తున్నారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో అన్ని వేళ్ళూ వైఎస్ జగన్ ఫ్యామిలీ వైపే చూపిస్తున్నాయి. ఒక బాబాయిని చంపిన కేసులో మరో బాబాయి జైలు పాలయ్యాడు. తమ్ముడు కూడా ఎప్పుడు అరెస్టు అవుతాడో తెలియని పరిస్థితి. ఆ అరెస్టుతోనే సీబీఐ ఆగుతుందా..? లేక వెతుక్కుంటూ తమదాకా వస్తుందా..? అనేది మిస్టరీగా మారింది. మరోవైపు.. ఆదుకుంటారని భావిస్తున్న ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్లు దొరకటం లేదు. ఇన్నాళ్లూ గుట్టుగా దాచిన రహస్యాలన్నింటినీ సీబీఐ రట్టు చేస్తుండగా.. విపక్షాలు, మీడియా సంస్థలు రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ గా వివేకా హత్య కేసు మార్మోగుతోంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా.. వివేకాను చంపింది.. వైఎస్ కుటుంబ సభ్యులే అంట కదా..? అని చర్చించుకుంటున్నారు. దీంతో.. ఏం చేయాలో తెలియక సీఎం జగన్ రెడ్డితో పాటు.. వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఏదో ఒక విధంగా.. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన జగన్.. విశాఖ రాజధాని అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాజధాని నగరంగా ఒక్క విశాఖకే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరంగా విశాఖను ఆయన అభివర్ణించారు. వచ్చే సెప్టెంబర్‌లో తన కాపురాన్ని విశాఖకు షిప్ట్ చేయబోతున్నాని ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని పాతపాటే పాడారు. అయితే.. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో “పోర్టు” శంకుస్థాపనకు వెళ్ళిన జగన్.. విశాఖ రాజధానిపై ప్రకటన చేయటం వెనుక.. పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చ గొట్టటం.. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చటమే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును స్థానిక ప్రజలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి మాయ మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. మొత్తం మీద.. వివేకా కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి జగన్ చేస్తున్న రాజధాని ప్రకటనలపై స్తానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *