చిత్తూరు డెయిరీని నాశనం చేసిన జగన్ సర్కార్

చిత్తూరు డెయిరీని నాశనం చేసిన జగన్ సర్కార్

1969లో ఏర్పాటైన చిత్తూరు డెయిరీ ప్రఖ్యాతి గాంచింది. చిన్న పాల సేకరణ కేంద్రంగా ప్రారంభమై .. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేసుకుని దేశంలోనే అతిపెద్ద డెయిరీగా అవతరించింది. సహకార రంగంలో నడుస్తున్న పాలడెయిరీలో జిల్లాలోని పాడి రైతులు భాగస్వాములుగా ఉండేవారు. 33 ఏకరాల్లో ఏర్పాటు చేసిన పాలడెయిరీ ఆస్తులతో పాటు.. జిల్లాలో .. 9,140 పాలసేకరణ కేంద్రాలు, పీలేరు, మదనపల్లి, శ్రీకాహస్తి, పిచ్చాటూరు ప్రాంతాల్లో పాలశీతల కేంద్రాలు కూడా ఉండేవి. అంచెలంచెలుగా ఎదిగిన చిత్తూరు డెయిరీ .. క్రమంగా నష్టాల బాట పట్టింది. 2002 ఆగస్టు 31వ తేదీన హఠాత్తుగా మూతపడింది.

2019లో చిత్తూరు జిల్లాకు వచ్చిన జగన్ రెడ్డి.. వైసీపీ అధికారంలోకి రాగానే.. చిత్తూరు డెయిరీని తెరుస్తామని .. ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవు ఇస్తానని.. తద్వారా పాలు అమ్ముకుని వచ్చే ఆదాయంతో.. జీవనోపాధి మెరుగు పడేలా చూస్తానని జగన్ భరోసా కల్పించారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయారు. 2019 నుంచి 2023 వరకు క్రమక్రమంగా.. ఏపీలో సహకార సంఘాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ కు.. రాష్ట్రంలో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా.. పాల సేకరణపై అమూల్‌ దశల వారీ కార్యాచరణ కు వైసీపీ సర్కార్ అన్ని విధాలా సహకారాన్ని అందించింది. ప్రైవేట్‌ డెయిరీలకు చెక్‌ పెట్టి, సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా .. జగన్ ప్రభుత్వం వత్తాసు పలికింది. పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ ఇస్తామని .. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరిచి, అమూల్‌ పాలు కొంటే అదనపు లాభం వస్తుందనే వాదన ప్రారంభించింది.

జగన్ సర్కార్ .. అన్ని.. తాను అనుకున్నట్లుగానే.. ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్, అమూల్ ‌ మధ్య ఒప్పందం చేసుకుంది. 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డెయిరీని.. 99 ఏళ్ల పాటు అమూల్‌కు .. సంవత్సరానికి కేవలం 1 కోటి రూపాలయకే అప్పగించారు. డెయిరీ భూమి, ఆస్తుల విలువ 650 కోట్ల రూపాయలకు పైగా ఉంది. చిత్తూరు డెయిరి మూసివేత సమయంలో, 140 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10 మంది మరణించారు. దాదాపు 110 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. 20 మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారు. ఉద్యోగులకు జీతం, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాల కోసం సుమారు 60 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. ఈ చెల్లింపులు ఎప్పుడు చేస్తారనే విషయాన్నికూడా.. వైసీపీ సర్కార్ కనీసం ప్రస్తావించడం లేదు.

అమూల్ డెయిరీపై గుజరాత్ ప్రభుత్వం కూడా ఇంత ప్రేమ చూపలేదు. కానీ.. జగన్ ప్రభుత్వం అమూల్ వైపు మొగ్గు చూపింది. అమూల్ డెయిరీ పాల సేకరణతో రైతులకు లీటరుకు రూ.4 చొప్పున అధికంగా వస్తాయని.. ఊదరకొడుతోంది. రైతు భరోసా కేంద్రాల్లో పాలు సేకరించి, అమూల్‌కు అప్పగించాలని పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారులను జగన్ ప్రభుత్వం ఆదేశించింది. అమూల్ ద్వారా జగన్‍కు లీటరకు రూ.4 కమీషన్ వస్తుంది. కానీ.. పాడి రైతులకు మాత్రం ఎలాంటి లాభం లేదని .. ప్రభుత్వ ఆస్తులు, వేల కోట్లు ప్రజల డబ్బు అమూల్ డెయిరీకి కట్టబెట్టడం చాలా దారుణమని వ్యాపారులు అంటున్నారు. అమూల్‌ రాకతోరాష్ట్రంలోని 7 ప్రైవేటు, 13 సహకార డెయిరీల మనుగడ కష్టమేనని వ్యాపారులు చెబుతున్నారు.

అమూల్ అప్పగింతలో .. ప్రభుత్వంలోని పెద్దలకు ముడుపులు ముట్టాయని.. ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి.చిత్తూరు పాలడెయిరీలో నేటికీ భాగస్వాములుగా ఉన్న పాడి రైతులు, కార్మికులతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. కోట్లాది రూపాయల విలువ చేసే చిత్తూరు సహకార డెయిరీ ఆస్తులను .. అమూల్ కు అప్పగించడంపై పాడిరైతులు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను .. అత్యంత చౌకగా.. 99 ఏళ్లకు అమూల్‌కు అప్పగించడం.. పాడి రైతులను దగా చేయడమే నని రైతులు వాపోతున్నారు. ఇదే సమయంలో.. చిత్తూరు డెయిరీ వ్యవస్థాపకుడు ఎన్‌పి వీరరాఘవులు విగ్రహాన్ని కూడా తొలగించడం పట్ల.. కుటుంబ సభ్యులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *