ఏపీలో సామాజిక పెన్షన్లలో భారీగా కోతలు పెట్టిన జగన్ సర్కార్

ఏపీలో సామాజిక పెన్షన్లలో భారీగా కోతలు పెట్టిన జగన్ సర్కార్

బటన్ నొక్కుడు పథకాలకు. . డబ్బులు లేక అప్పులు మీద అప్పులు చేస్తున్న జగన్ సర్కార్‌కు సామాజిక పెన్షన్లు గుదిబండలా మారుతున్నాయి. ఇప్పటికే పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు అనేక రకాల నిబంధనలను జగన్ సర్కార్ పెట్టింది. ఏదో ఒక సాకు చూపిస్తూ పెన్షన్లలో కోత వేస్తూ వచ్చింది. దీంట్లో భాగంగా… ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల చాలా మంది పెన్షనర్లు ఫిల్టర్ అయిపోతున్నారు. బ్యాంక్ అకౌంట్లకు, కరెంట్ బిల్స్ కు పెన్షన్లను లింక్ పెట్టటంతో ప్రతీ నెలా వేలాదిమంది పెన్షన్ సొమ్ము అందుకోలేక పోతున్నారు. తాజాగా వైఎస్సార్ పింఛను కానుక, సామాజిక భద్రత పింఛనుదారుల గుండెల్లో బాంబు పేల్చింది జగన్ ప్రభుత్వం. సచివాలయానికి 15 కిలోమీటర్లు లోపు ఉంటేనే పింఛను అందిస్తామంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పోర్టబులిటీ విధానాన్ని రద్దు చేసిన సీఎం జగన్.. లబ్దిదారులను అమోమయంలో పడేశారు. తాజాగా జియో ఫెన్సింగ్ నిర్ణయంతో పెన్షనర్లు దిక్కుతోచని స్ధితిలో పడిపోతున్నారు.

ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన జియో ఫెన్సింగ్ విధానంలో సచివాలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారికి మాత్రమే పెన్షన్ అందుతుంది. ఈ పరిధి దాటిన వారికి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వరు. ఏదైనా కారణాల వల్ల ఈ పరిధి దాటి నివసిస్తున్న వారు.. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ అధికారి అనుమతి పత్రాన్ని విధిగా చూపించాలి. లేకపోతే వారికి పెన్షన్ అందదని జగన్ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో.. సొంత గ్రామానికి వెలుపల ఉంటున్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లోని తమ కుమారుడు, లేదా కుమార్తె ఇళ్ళలో నివశిస్తున్న వృద్ధులకు జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ శరాఘాతంలా తగులుతున్నాయి.

ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా 63.42 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. ఏప్రిల్ నెలలో కూడా వీరందరికీ పెన్షన్లు అందాల్సి ఉంది. అయితే.. వీరిలో అనేక మంది వివిధ కారణాలతో సొంత ఊరికి దూరంగా ఉంటున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన వారు కొందరైతే.. తమ వారసుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు అనేక మంది ఉన్నారు. వీరితో పాటు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న వారు కూడా సొంత ఊరికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే.. జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన జియోఫెన్సింగ్ విధానం వల్ల… సొంత గ్రామాలకు దూరంగా జీవిస్తున్న వారంతా పెన్షన్లు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో దూర ప్రాంతాలలో ఉంటున్న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏజన్సీ, మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన లబ్ధిదారులకు కొంత దూరం వెళ్లి పింఛను పంపిణీ చేసేవారు. జగన్ తాజా నిర్ణయంతో వారు కూడా ఇబ్బంది పడే పరిస్థి తలెత్తింది.

నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి, వేరే ప్రాంతాల్లో నివశిస్తున్న పెన్షనర్లకు పోర్టబులిటీ విధానంలో అక్కడే పింఛను తీసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత ఈ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఏ నెల పింఛను.. ఆ నెల తీసుకోవాలనే నిబంధన పెట్టింది. దీంతో ఇప్పటికే సామాజిక పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వారిని మరిన్ని ఇక్కట్లకు గురి చేయనుంది. పెన్షన్లు ఎగ్గొట్టటానికే సీఎం జగన్ ఈ కొత్త నిబంధన తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అవ్వాతాతలు.. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…
చంద్రబాబు అరెస్టు పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందన

చంద్రబాబు అరెస్టు పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందన

చంద్రబాబు అరెస్ట్‌ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు . చంద్రబాబు అరెస్ట్‌ కక్ష సాధింపులా కనిపిస్తోంది . కక్షసాధింపు రాజకీయాలు సమర్థనీయం కాదు అని అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *