ఏపీలో జగన్ రెడ్డి బాదుడే.. బాదుడే.. ఏటాటా పెరుగుతున్న ఆస్తిపన్ను

ఏపీలో జగన్ రెడ్డి బాదుడే.. బాదుడే.. ఏటాటా పెరుగుతున్న ఆస్తిపన్ను

ఏపీలో జగన్ రెడ్డి జమానాలో ధరల మోత, పన్నుల వాత పెరుగుతోంది. ఆస్తిపన్ను, చెత్తపన్ను అంటూ జగన్ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. గతంలో ఆస్తి పన్ను పెంచబోమంటూ చెప్పిన జగన్, మళ్లీ మడమ తిప్పేశారు. పట్టణ వాసులకు జగన్‌ సర్కారు పన్నుపోటుతో చుక్కలు చూపిస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్ రెండింతలు పెరగడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మహా నగరాల్లో కూడా లేని పన్నులతో జగన్ రెడ్డి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా మోత మోగించిన జగన్ సర్కార్..ఏపీ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది.

ఏపీలో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనికి తోడు పన్నుపోటుతో… పేద, మధ్య తరగతి ప్రజలను జలగలా పీడిస్తోంది జగన్ సర్కార్. పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటోంది. ఇక, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇది చాలదన్నట్లు ఆస్తిపన్ను, చెత్తపన్ను ఇలా రకరకాలుగా జనాలను పీల్చిపిప్పి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచేసింది. ఏడాదిలో 15 శాతం పెంచగా, రెండు సంవత్సరాల్లో 32.24 శాతం పెరిగినట్లైంది. పెరిగిన ధరలకు ఈ పన్నుపోటు తోడవ్వటంతో.. సామాన్య ప్రజల వెన్ను విరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన ఆస్తి విలువ ఆధారిత పన్నులను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. దీంతో ఆస్తి విలువ పెరిగే కొద్దీ ప్రజలపై అదనంగా పన్నుల మోత మోగనుంది. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాల్లో కూడా ఇలాంటి పన్నులు లేవంటే అతిశయోక్తి కాదు. ఏపీలో ఏటా 10-15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంపుతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం 2021-22 నుంచి అమల్లోకి రాగా, గత మూడేళ్లలో ప్రజలపై 659.55 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడింది. పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో పన్ను చెల్లింపుదారులు, ప్రజాసంఘాలు కొత్త విధానాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం అమలు చేసింది. ఇలా జనం ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను జగన్ సర్కార్.. బటన్ నొక్కుడు పథకాలకు మళ్ళిస్తోంది. దీంతో ఓ చేత్తో బటన్ నొక్కుడు పథకాలు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న ప్రభుత్వం.. మరో చేత్తో పన్నుల బాదుడు బాదుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు.

ఇక.. పాత పన్నుల విధానంలో వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన 2020-21లో…. విశాఖలోని సీతమ్మధారలో 950 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్‌కు దాని యజమాని 3వేల 834రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఇది 4వేల 410కి పెరిగింది. 2022-23లో 5వేల 72కు పెరగ్గా, 2023-24లో 5వేల 534కి చేరినట్లు నగరపాలక సంస్థ ఆన్‌లైన్‌లో డిమాండ్‌ నోటీస్‌ అప్‌లోడ్‌ చేసింది. ఒక్క విశాఖ నగరంలోనే కాదు.. రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు.. మున్సిపాల్టీల్లో పరిస్థితి ఇలాగే ఉంది. జగన్ రెడ్డి విధానం వల్ల ఏటేటా పన్నుల భారం మరింతగా పెరిగి పోతోంది. దీంతో 100కు పైగా ఉన్న మున్సిపాల్టీల్లో ప్రజలు పన్నుల వాత తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్నులు తగ్గిస్తానని చిలక పలుకులు పలికిన జగన్.. ఇప్పుడు పన్నుల మోత మోగించటాన్ని తట్టుకోలేక పోతున్నారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటూ శాపనార్దాలు పెడుతున్నారు.

కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాలుగా జనాలను వేధించడం ఏపీలో సర్వసాధారమైపోయాయి.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ, జగన్ సర్కార్ ఏటేటా ఎడాపెడా మోగిస్తున్న పన్నుల భారంతో ప్రజలు కుదేలైపోతున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జగన్ సర్కార్ ను తిట్టిపోస్తున్నారు ప్రజలు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *