జగన్ ఉస్కో అంటే.. డిస్కో అంటోన్న పేర్నినాని

జగన్ ఉస్కో అంటే.. డిస్కో అంటోన్న పేర్నినాని

వైసీపీ ఎమ్మెల్యే పేర్నినానికి ఏమైంది? ప్రతీ దానికి తగుదనమ్మా అంటూ మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు? మంత్రి పదవి పోయాక పిచ్చి పీక్స్ కు చేరిందా?చంద్రబాబు, లోకేష్, పవన్ పేరు చెప్పగానే ఎందుకు అలా ఊగిపోతున్నారు? మైక్ ముందుకొచ్చి ఎందుకలా వాగుతున్నారు? వచ్చే ఎన్నికల్లో గెలవనని తెలిసి, పేర్ని ప్రస్టేషన్ లోకి పోయినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. అందుకే, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానంటున్న ఈ మాజీ మంత్రి.. తనకు బదులుగా తన కొడుక్కి టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను ప్రాధేయపడుతున్నాడట. అయితే, జగన్ కిట్టూకి నో టిక్కెట్ అనడంతో ఆందోళన చెందుతోన్న పేర్ని…బాస్ ను కాకా పట్టడం కోసమే… ప్రతిపక్ష పార్టీ నేతలపై పిచ్చి ప్రేలాపలనలు పేలుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం ప్రజాసమ్యలను గాలికొదిలేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తుంటాయ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంటాయి. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి అప్పులు పాలు చేస్తున్నప్పుడు నిలదీస్తుంటాయ్. ఈ క్రమంలోనే పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటికి సమాధానం చెప్పకుండా… చెప్పులతో కొడతానంటూ పేర్నినాని ప్రెస్ మీట్లో దిగజారి మాట్లాడటంపై జనసైనికులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిథిగా గెలిచిన వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అవేమీ లేని అధికార పార్టీ నేతలు… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి తూలనాడేలా నీచ రాజకీయాలు చేస్తున్నారు.

మచిలీపట్నంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప పేర్నినాని పెద్దగా చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చేసిన వాటికే పదే పదే శంకుస్థాపనలు చేయడం తప్ప, నియోజకవర్గంలో డెవలప్ మెంట్ అనేది ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. తాను ఫేమస్ అవ్వటం కోసమే.. జగన్ ఉస్కో అంటే పేర్నినాని డిస్కో అంటూ ప్రెస్ మీట్ల ముందుకొచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని అంటున్నారు. పేర్నినానికి తన కొడుకును ప్రమోట్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ… ప్రజలపై లేదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *