
అవినాష్ ఎస్కేప్ కోసం తెరపైకి కొత్త క్యారెక్టర్లు
- Ap political StoryNewsPolitics
- May 25, 2023
- No Comment
- 34
అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకునేందుకు వైసీపీ బ్యాచ్ తెగ కష్టపడుతోంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే, సీబీఐ ఆ తర్వాత తట్టేది జగన్ ఇంటి తలుపేనన్న ప్రచారం జరుగుతోంది. అందుకే, అంతదాకా రానీయకుండా జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ పై ఈగ వాలనీయకుండా చూడాలని, ముందుగా అవినాష్ రెడ్డిని సేఫ్ చేయాలనే ఆలోచనలోనే… ప్రధాన సలహాదారుడు, ఆయన వెనక ఉన్న పేటీఎం బ్యాంచ్ రాత్రి, పగలనక స్క్రిప్ట్ లు రాసేస్తోందట. వైసీపీలో సలహాదారులకు కొదవేం లేదు కదా. సీబీఐ నోటీసులివ్వగానే, వస్తున్నానంటూ అవినాష్ వెళ్లడం…ఈలోగా పార్టీని లీడ్ చేస్తున్న ఓ సలహాదారుడి నుంచి మెసేజ్ వెళ్లడం..ఆ తర్వాత జగన్నాటకమంతా మనం చూస్తున్నాం.
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టిన సంఘటనలను ఓ సారి గమనిస్తే…16న అత్యవసర పనులున్నాయని చెప్పి అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లిపోయారు. సీబీఐ నోటీసులిచ్చిన కారణంగానే ముందస్తు కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్ కు వెళ్లిన అవినాష్ రెడ్డి… మళ్లీ పనులున్నాయని చెప్పి వెళ్లిపోవడాన్ని ఏమంటారు?తప్పించుకోవడమే అంటారు? మళ్లీ 19న రావాలంటూ సీబీఐ నోటీసులు. ఇక, ఈసారి మరో డ్రామా. ఇదిగో వస్తున్నానంటూ హైదరాబాద్ నుంచి అవినాష్ , ఆయన అనుచరగణం కాన్వాయ్ లు బయల్దేరాయి. మధ్యలో మళ్లీ సలహాదారుడి నుంచో లేక మరొకరి నుంచి ఫోన్ మోగడం… అంతే, అమ్మకు బాగోలేదనే హైడ్రామా షురూ చేశారు. ఆయన పులివెందులకు బయల్దేరడం, అనారోగ్యంగా ఉన్నారని కర్నూలు ఆస్పత్రిలో చేర్పించడం జరిగిపోయాయి. పరిస్థితి క్రిటికల్ గా ఉంటే కర్నూలు గల్లీలో ఎవరూ ట్రీట్మెంట్ చేయించరనేది తేలిపోంది.
ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈసారి వారం రోజులు విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. అటు సీబీఐ అధికారులకి అరెస్ట్ చేయాలనే ఆదేశాలు అప్పటికీ పైనుంచి అందలేదనే ప్రచారం ఉంది. అందుకే, అధికారులు ఆస్పత్రిలో ఓ వెహికిల్ పెట్టడం, అదిగో అరెస్ట్ అంటూ మీడియా ఊదరగొట్టడం జరిగింది. కానీ, అరెస్ట్ లేదు. అధికారులు ఆయన దగ్గరకు వెళ్లింది లేదు. ఇక, ఈ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే…కొత్తగా ఫ్యామిలీని రంగంలోకి దింపి ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జగన్ తల్లి విజయమ్మ హుటాహుటిన కర్నూలు ఆస్పత్రికి వెళ్లారు. ఎక్కడో హైదరాబాద్ లో షర్మిల దగ్గర ఉంటోన్న విజయమ్మను కర్నూలుకు రప్పించారు. ఆమె అవినాష్ తల్లిని పరామర్శించిన ఫోటోలు ఎక్కడా రాలేదు. కానీ, ఏదో జరుగుతుందనే అనుమానాలు అయితే కలిగాయి.
ఈలోగా తాడేపల్లి ప్యాలెస్ మరో స్క్రిప్ట్ రెడీ చేసింది. విమలారెడ్డిని ప్రవేశపెట్టారు. ఆమె జగన్ మేనత్త, వైఎస్ వివేకా సోదరి కూడా. ఆమె అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ, సునీతదే తప్పన్నట్లు మాట్లాడారు. ఇంకేముంది, నీలిమీడియా దాన్ని హైలెట్ చేసి, అవినాష్ సచ్చీలుడు అని చెప్పే వార్తలు వండివార్చేసింది. ఇవన్నీ చూసిన జనాలకు.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అల్లుతున్న కట్టుకథలని అర్థమైపోయింది. తాడేపల్లి నుండి కథా స్క్రీన్ దర్శకత్వం చేస్తోంది ఎవరనేది కూడా అర్థమైపోయింది.