
ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలతో మీటింగ్‌లో జగన్ ముందస్తు ప్రకటన..?
- Ap political StoryNewsPolitics
- March 31, 2023
- No Comment
- 32
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పార్టీలో అసమ్మతి, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు.. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ఆయన గడప గడపకూ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, జిల్లాల ఇంచార్జ్‌లతో సమీక్షించనున్నారు. ఇటీవలే గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్… 3వ విడత మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపైనే చర్చించినట్టు సమాచారం. పని చేయని మంత్రులపై వేటు తప్పదని ఇప్పటికే హెచ్చరించిన జగన్.. త్వరలో పలువురికి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డికి ఛాన్స్ దొరకవచ్చని చెబుతున్నారు. ఈ అంశంపై కూడా ఎమ్మెల్యేల మీటింగ్‌లో జగన్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది .
మరోవైపు…ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి.. పెరుగుతోన్న రుణభారం.. జనంలో వీస్తున్న ప్రతికూల పవనాల నేపథ్యంలో జగన్ ముందస్తు ఎన్నికలపై ఓ ప్రకటన చేయవచ్చని అంటున్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహంలోనే భాగంగా ఆయన గడప గడపకు కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఆ కార్యక్రమం కంప్లీట్ కావటంతో.. ముందస్తు ఎన్నికలు ఉంటాయో…? లేదో అనే దానిపై కూడా ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఇటీవల పార్టీలో పెరిగిన అసమ్మతి పై కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సుమారు 20 నుంచి 30 మంది కి టికెట్లు దక్కవని అంటున్న ఆయన..ఆ అంశంపైనా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. తనపై.. పార్టీపై నమ్మకం లేని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్లి పోవచ్చని చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, గవర్నర్ తో భేటీ, ఢిల్లీ టూర్ తరువాత జగన్ ఏర్పాటు చేస్తున్న ఈ రివ్యూ మీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.