జనం సొమ్ముతో జగన్ కోసం పూజలా..?

జనం సొమ్ముతో జగన్ కోసం పూజలా..?

సీఎం జగన్ రెడ్డి పదవి పదిలంగా ఉండాలంటూ ఆయన భజనపరులు మరో స్కీం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్న మంత్రులను, ఎమ్మెల్యేలను చూశాం… ఇక ఏకంగా జగన్ రెడ్డి మెప్పుకోసం మహాయజ్ఙమే తలపెట్టారు. అయితే ఇదంతా వారి సొంత ఖర్చుతో చేస్తున్నారా..అంటే అదీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖల ఖర్చుతో ఈ మహాయజ్ఙం నిర్వహించనున్నట్టు సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ప్రజల సొమ్మును ఇలా మంచి నీళ్లలా ఖర్చు చేయాలనే నిర్ణయంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అసలు ఉన్నట్టుంది ఈ మహాయజ్ఙం ఎందుకు తలపెట్టారు? సీఎం జగన్ రెడ్డి కుర్చీ కదులుతోందా?

ఒకటో తేదీ జీతాలు, ఫించన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేయడంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. సీఎం జగన్ రెడ్డి పాలనకు ఎటువంటి ఆటంకాలు రాకూడదంటూ మహాయజ్ఙం నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. దేశానికే ఆదర్శంగా నాలుగేళ్ల నుంచి సీఎం జగన్ రెడ్డి సంక్షేమ పాలన సాగుతోందని, అది మరింత బలోపేతం కావాలని భగవంతుడి ఆశీర్వాదం కోసం ప్రభుత్వం మహాయజ్ఙం తలపెట్టినట్టు ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు.

ప్రజలను పీల్చి పిప్పిచేసి వసూలు చేసిన పన్నుల డబ్బుతో సీఎం కుర్చీ బలోపేతం కావాలంటూ యజ్ఙం చేయాలని నిర్ణయిండచంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇలాగే కానసాగాలని అందుకు ప్రకృతి సహకరించాలని కాంక్షిస్తూ మే 12 నుంచి 17 వరకు అంటే 5 రోజుల పాటు మహాయజ్ఙం నిర్వహించబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రటించారు. విజయవాడ సమీపంలో కృష్ణా నది తీరంలో ఈ క్రతువు నిర్వహించేందుకు పలు ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. కోట్లకు కోట్లు ప్రజల సొమ్మును చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఙానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం ఖర్చు దేవాదాయ శాఖ భరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనుకున్నారో ఏమో, కొంత ఖర్చు టీటీడీ భరించేందుకు ముందుకు వచ్చిందంటూ మెలిక పెట్టారు. ఈ మహాయజ్ఙంలో సాక్షాత్తూ సీఎం జగన్ రెడ్డి కూడా పాల్గొంటారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించడంపై కొందరు కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.

అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రభుత్వం 12 కోట్ల ఖర్చుతో మహాయజ్ఙం నిర్వహించాలని నిర్ణయించడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ కీలక నేతలు అడ్డంగా ఇరుక్కుపోవడం, మరోవైపు వైసీపీ నేతలను వెంటాడుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్, సీఎం జగన్ రెడ్డి పాలనపై వైసీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొనడం చూస్తుంటే ఈ యజ్జం స్వయంగా టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పకుండా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో విజయవాడ దుర్గ గుడి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టించారు. చుట్టుముడుతున్న కేసుల నుంచి రక్షించేందుకు ఇప్పటికే మైసూరు గురువు విజయ్ కుమార్ ను ఆశ్రయించారు. ఆయన సలహా మేరకే ఈ మహాయజ్ఙం నిర్వహించ తలపెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *