
లోటస్ పాండ్‌లో హల్చల్ చేసిన వైఎస్ షర్మిళ
- NewsPoliticsTelangana Politics
- April 24, 2023
- No Comment
- 90
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ హల్చల్ చేశారు. తనను అడ్డుకున్న పోలీసులపై ఆమె వాగ్వాదానికి దిగారు. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యి చేసుకున్నారు. దీంతో లోటస్ పాండ్ ఏరియాలో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. రోడ్డు మీద నుంచి లేవమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. ఇద్దరు పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో కాసేపు షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.