టీడీపీ టార్గెట్ గా వైసీపీ, బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ?

టీడీపీ టార్గెట్ గా వైసీపీ, బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ?

ఏపీలో నాలుగేళ్ల పాటు చిలుకా గోరింకల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వైసీపీ, బీజేపీలు… ఇప్పుడు నేను తిట్టినట్లు చేస్తాను, నీవు ఏడ్చినట్లు నటించు అన్న చందనా మైండ్ గేమ్ పాలిటిక్స్ మొదలుపెట్టాయి. తాజాగా బీజేపీ అనే గోరింక తన సహచరుడైన జగన్ పై చిలుక పలుకులు పలుకుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిశాక, ఏపీ రాజకీయాలు మారిపోయానే ప్రచారం జోరందుకుంది. అందుకు తగ్గట్లే అమిత్ షా, నడ్డాలు ఏపీ పర్యటనలో జగన్ పై దుమ్మెత్తిపోయడంతో… టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఫిక్స్ అంటూ బ్రేకింగ్ లు పేలిపోతున్నాయి. కానీ, వైసీపీతో బీజేపీ రహస్య పొత్తు కంటిన్యూ అవుతుందనేది స్పష్టంగా కనబడుతోంది.

అమిత్ షా, నడ్డాలు జగన్ సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూ గేమ్ మొదలుపెడితే… ఆ వెంటనే జగన్ బ్యాచ్ తాము ఒంటరైపోయామనే సింపథీ ప్లే చేస్తోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని…. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష టీడీపీ నాలుగేళ్లుగా గొంతు చించుకుంటోంది. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన మారిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వల్లకాడు చేశాడని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కానీ, బీజేపీ పెద్దలు ఏనాడు జగన్ ను పల్లెత్తు మాట అన్నది లేదు. అక్రమాలకు ఆద్యుడని తెలిసినా కూడా అతనిపై విచారణకు ఆదేశించింది లేదు.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి కీలక నిందితుడని సీబీఐ అభియోగాలు మోపినా, అరెస్ట్ కు తెరవెనక శక్తులు అడ్డుపడుతున్నాయి. గాంధీ కుటుంబాన్నే ఈడీ ఆఫీసుల చుట్టూ తిప్పి గడగడలాడించిన బీజేపీ నేతలు, వివేకా హత్య విషయంలో వైఎస్ కుటుంబసభ్యుల పాత్రపై ఆధారాలు అంత స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కాపాడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాలుగేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం జగన్ ఏనాడు కేంద్రాన్ని నిలదీసింది లేదు. విభజహామీలు నెరవేర్చకపోయినా, తన కేసులు మాఫీ అయితే చాలన్నట్టుగా బీజేపీతో బంధాన్ని కొనసాగించారు. కానీ, ఇప్పుడు హోదా ఏది, రైల్వే జోన్ ఎక్కడ?కడప ఉక్కు ఇవ్వరా అంటూ యాక్టింగ్ షురూ చేస్చున్నారు. అటు కేంద్రపెద్దలు ఇప్పటి వరకూ రాజధాని విషయంలో పెదవి విప్పలేదు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే అని గతంలో కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే, తమ పర్యటనలో బీజేపీ అగ్రనేతలిద్దరూ అమరావతికి మద్దతుగా మాట్లాడటం చూస్తుంటే..టీడీపీని ముంచేందుకేననే టాక్ వినిపిస్తోంది.

బీజేపీని ఏపీలో ముస్లిం మైనారిటీలు, దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈసారి ఆ ఓటు బ్యాంక్ అంతా టీడీపీ వైపు మళ్లుతున్నారు.దాంతో, జగన్ కేంద్రపెద్దలతో కలిసి బిగ్ స్కెచ్ వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈ వర్గాలు వైసీపీతోనే ఉండేవిధంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది. జగన్ ను తిట్టడం ద్వారా టీడీపీ, బీజేపీ ఒక్కటేననే సంకేతాలు పంపిస్తూ…మైనారిటీలు, దళితులను తెలుగుదేశం పార్టీ దూరం చేసే వ్యూహంతో కమలం పార్టీ కనిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ ఏపీకి తీరని అన్యాయం చేసిందనే ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తోందనే ఆవేశం, ఆక్రోషం కమలనాథులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు ఒక్కటేనని చెప్పడం ద్వారా…సింపథీ గెయిన్ చేస్తూ ఓట్లు కొల్లగొట్టేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నారు. కమలం నేతల మైండ్ గేమ్ పాలిటిక్స్ లో భాగంగానే టీడీపీని దెబ్బకొట్టేందుకు… అమిత్ షా జగన్ పై ఘాటు విమర్శలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ తో కలిసి పువ్వు గుర్తు నేతలు మరోసారి ప్రజల చెవిలో పువ్వు పెట్టేందుకు వస్తున్నారని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తేరుకోకపోతే మునిగిపోవడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *