వైసీపీని అష్టదిగ్బందనం చేసిన చంద్రబాబు, లోకేష్

వైసీపీని అష్టదిగ్బందనం చేసిన చంద్రబాబు, లోకేష్

తెలుగుదేశంపార్టీ ధాటికి అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు లక్ష్యంగా అధికార పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు బెడిసికొడుతున్నాయి. వాటిని సమర్థించుకునే మార్గం లేక వైసీపీ ఆత్మరక్షణలో పడింది. దీంతో అధికారపార్టీ ప్రజాక్షేత్రంలో నవ్వుల పాలవుతోంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జరుపుతున్న పర్యటనలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తుండటంతో అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు కరవైంది. అదే సమయంలో గత రెండున్నర మాసాలుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

యువగళం యాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతున్నప్పటికి అది ప్రభంజనం లా సాగుతుంది. వంద రోజులైనా కాక ముందే యువగళం జన సునామీగా మారింది. ముందుముందు అదెంత ప్రభంజనం సృష్టిస్తుందో అంచనాలకు అందకుండా వుంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ లు ఇరువురూ వైసీపీ నాయకులపై పదునైన అస్త్రాలు సంధిస్తున్నారు. బాధితులకు అండగా వుండి భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం విషయంలో టిడిపి హయాంలో మేము ఇలా చేశాం, మీరేం చేస్తున్నారు చెప్పండి అంటూ సెల్ఫీ ఛాలెంజ్ లు విసురుతున్నారు. అధికార పార్టీ పత్రిక లోకేష్ పై విషం చిమ్ముతూ రాసిన కథనాలపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దళితులను కించపరిచారనే విష ప్రచారానికి తెరదీసింది. దానిపై లోకేష్ తాను మాట్లాడిన అసలు వీడియోను బహిరంగంగా విడుదల చేశారు. సాక్షి యాజమాన్యాన్ని సవాల్ చేశారు. వీటిలో ఏ ఒక్క దానికీ జవాబు చెప్పే స్థితిలో అధికార పార్టీ నాయకులు లేరు. సాక్షి పత్రిక యాజమాన్యం పై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కేసులు నమోదు చేయని పక్షంలో న్యాయపోరాటానికి సైతం టిడిపి శ్రేణులు సిద్ధమయ్యాయి. అదేవిధంగా చంద్రబాబు పై గతంలో వైసీపీ నాయకులు చేసిన ప్రచారాలు అన్నీ అభూత కల్పనలు అని ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాయి. కోడి కత్తి కేసులో ఏవిధమైన కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఎ నిగ్గు తేల్చింది. అదేవిధంగా పింక్ డైమండ్, నారాసుర రక్త చరిత్ర కథనాలు పూర్తిగా కట్టుకథలేనన్న విషయం స్పష్టమైంది. వీటన్నింటి పై చంద్రబాబు పరువునష్టం దావా వేశారు. ఒకవైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్ లు ఇరువురూ ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని నిలదీస్తూనే, న్యాయపోరాటాలకు సన్నద్ధం అయ్యారు. దీంతో పార్టీ శ్రేణులకు సైతం మనో స్థైర్యం పెరిగింది. మరింత తెగింపుతో పోరాటాలకు సన్నద్ధం అవుతున్నారు.

 

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *