
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా
- Ap political StoryNewsPolitics
- March 29, 2023
- No Comment
- 28
గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మరోసారి రెచ్చిపోయారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే ముస్తఫా, రోగుల నుంచి లంచాలు తీసుకుంటే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తానంటూ సిబ్బందిని బెదిరించారు. దీంతో వైద్య సిబ్బంది మొత్తం దర్నాకు సిద్దం అయ్యారు. ఎమ్మెల్యే మాటలు తమను బాధించాయని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి చేయిదాటేట్టు ఉండటంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి రంగంలోకి దిగారు.
విషయం ఎమ్మెల్యేకు చేరవేయడంతో మరోసారి హాస్పటల్ కు వచ్చారు. సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రోగుల నుంచి లంచాలు తీసుకోకుండా సేవలు అందించాలని అందరూ కోరుకుంటారు. కాని వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేస్తానంటూ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరించడంపై విమర్శలు వస్తున్నాయి.