హంతకులు, అసాంఘిక శక్తులకు నీరాజనాలా..?

హంతకులు, అసాంఘిక శక్తులకు నీరాజనాలా..?

ఆంధ్రప్రదేశ్‌లో హంతకులకు నీరాజనాలు పట్టటం ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ ఈ విష సంస్కృతి‌ని పెంచి పోషిస్తోందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. హత్యలు, అత్యాచారాలు, దళితులపై దాడులకు పాల్పడ్డ రాజకీయ నాయకులను.. ఆ పార్టీ నాయకత్వం అందలం ఎక్కిస్తోంది. ఎవరేమనుకున్నా.. మాకేంటి సిగ్గు..! అన్న చందంగా వ్యవహరిస్తోంది. డెడ్ బాడీని డోర్ డెలవరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి.. వివేకా హత్యకేసులో అరెస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేయటం వరకు.. వైసీపీ నేతలు చేస్తున్న వికృత విన్యాసాల పట్ల.. జనంలో ఏహ్యభావం వ్యక్తం అవుతోంది. ప్రాణాలు తీసే కిరాతకులకు.. ఇలా నీరాజనాలు పట్టటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ వర్గాల ప్రజలపై దాడులు, రాజకీయ హత్యలు మితిమీరి పోయాయి. ఓ పథకం ప్రకారం రాజకీయ ప్రత్యర్ధులను కడతేరుస్తున్నారు. అయితే.. ఆయా ఘటనలకు పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సింది పోయి.. వారిని అధికార వైసీపీ హీరోలుగా ప్రొజక్ట్ చేస్తోంది. వివేకా హత్య కేసులో నిందితుల అరెస్టు సందర్భంగా వైసీపీ శ్రేణులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యాయి. వివేకా హత్యలో కీలక నిందితుడైన భాస్కర్ రెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు పులివెందులలో షాపులను బంద్ చేయించారు. అంతే కాదు..పట్టణ వీధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు సైతం చేయించారు. వివేకానంద రెడ్డి కుటుంబానికి బాసటగా నిలవాల్సింది పోయి.. హంతకుల కోసం ర్యాలీలు చేయటం ఏంటనే ప్రశ్న.. పులివెందుల ప్రజల నుంచి వినిపిస్తోంది. వైసీపీకి పోయేకాలం దాపురించిందని.. అందుకే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వివేకానందరెడ్డి విషయంలోనే కాదు.. తన కారు డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు సైతం వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. దళిత డ్రైవర్‌ను హత మార్చటమే కాకుండా.. డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం చాలా రోజులు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అనంతరం పోలీసుల చలవతో బెయిల్ పై విడుదల అయ్యారు. వాస్తవానికి.. ఎవరైనా తీవ్రమైన నేరాలు చేస్తే.. సిగ్గుతో తలదించుకుంటారు. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం తాను ఓ ఘన కార్యం చెసినట్టుగా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. తన అనుచరులతో పూలు జల్లించుకుంటూ.. హారతులు పట్టించుకుంటూ హంగామా చేశారు. ఓ దళితుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న అనంతబాబు ఇలా విజయోత్సవ ర్యాలీలు చేయటం అందరినీ నివ్వెర పరిచింది.

వివేకా హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాలను కాసేపు పక్కన పెడితే.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడే వారందరికీ వైసీపీ‌లో అందలాలు దక్కుతున్నాయి. ఈ జాబితాలో ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, జక్కం పూడి రాజా, తోట త్రిమూర్తులు వంటి ఎంతో మంది నేతలను సీఎం జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారు. మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమ పై దాడికి పాల్పడ్డ తురగా కిషోర్‌ను ఆ తరువాత మున్సిపల్ ఛైర్మన్ ను చేశారు. ఏకంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయించిన దేవినేని అవినాష్‌కు సైతం సీఎం జగన్ ఆశీస్సులు అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్టు కొండవీటి చాంతాండంత ఉంటోంది. వైసీపీ శ్రేణులన్నీ ఇలా ఎందుకు రెచ్చిపోతున్నాయి అని అంటే.. అన్ని వేళ్లూ సీఎం జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. అసాంఘిక శక్తులను జగన్ ప్రోత్సహిస్తుండటంతోనే.. ఏపీలో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *