
గడప గడపలో వాలంటీర్లతో ఈ వైసీపీ భజనేంటి జగనూ..?
- Ap political StoryNewsPolitics
- April 5, 2023
- No Comment
- 73
ఏపీలో వాలంటీర్లు వైసీపీ క్రియాశీలక కార్యకర్తల్లా మారిపోయారు. ప్రజల సొమ్ముతో గౌరవ వేతనం పొందుతున్న వాలంటీర్లను పార్టీ ప్రచారానికు వాడుకునేలా, వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొత్త కుట్రకు తెరలేపారు. వాలంటీర్ల వ్యవస్థపై గతంలోనే హైకోర్టు తప్పుపట్టినా సీఎం తీరు మాత్రం మార్చుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లోవాలంటీర్లను కీలకం చేసేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటునన్నారు. ప్రభుత్వ పథకాల ముసుగులో వారితో పార్టీ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే ఏప్రిల్ 7 నుంచి వారితో మరో భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం.
వైసీపీ సేవల కోసమే వాలంటీర్లను తీసుకొచ్చినట్టుంది జగన్. 2019లో అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది వైసీపీ సర్కార్. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకేనంటూ మొదట్లో చెప్పుకొచ్చారు. ఆ తరవాత వాలంటీర్లను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమూలన సీఎం జగన్ రెడ్డి మీటింగ్ పెట్టినా జనాలను తరలించే బాధ్యత వాలంటీర్లకు అప్పగిస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకం అందాలన్నా వాలంటీర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించే పనిని వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారంటూ గతంలోనే హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా వైసీపీ నేతలు తగ్గడం లేదు. ఇక ఏప్రిల్ 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే” కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఇది నూటికి నూరుశాతం పార్టీ ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రచారానికి కూడా వాలంటీర్లను రంగంలోకి దించుతున్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రచారకిట్లను కూడా వాలంటీర్లకు అందించారు.
ఏప్రిల్ 7వ తేదీ నుంచి ” జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు వివరించడంతోపాటు, ప్రతి ఇంటి డోర్ కు సీఎం జగన్ రెడ్డి బొమ్మతో కూడిన స్టిక్లర్లు అంటించనున్నారు. ఇక ప్రతి లబ్దిదారుడి మొబైల్ వెనకాల కూడా ఓ చిన్న స్టిక్కర్ అంటించాలని వాలంటీర్లను ఆదేశించారు. అయితే, ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఏటా 1,900 కోట్లు గౌరవ వేతనంగా పొందుతున్న వాలంటీర్లు వైసీపీకి ప్రచారం ఎలా చేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం ఎలా చేసుకుంటారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా, సీఎం జగన్ రెడ్డి మాత్రం వెనకడుగు వేయడం లేదు. జగన్ కు ఆలోచన రాలేదేమో గానీ, వాలంటీర్లతో మనుషులకు కూడా స్టిక్కర్లు అంటించినా ఆశ్చర్యపోనవరం లేదని జనం నవ్వుకుంటున్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో వాలంటీర్లు, కన్వీనర్లు, గృహసారధులు, వార్డు, సచివాలయ కార్యదర్శులు పొల్గోననున్నారు. వైసీపీ ప్రతినిధులుగా వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? అంటూ కుశల ప్రశ్నలు వేస్తారు. ఆతర్వాత ఇంటి డోరుకు స్టిక్కర్లు వేయడం, మొబైల్ ఫోన్ కు ఓ చిన్న స్టిక్కర్ అంటించడంతోపాటు, ప్రతి ఇంటి యజమాని మొబైల్ నెంబర్లు సేకరిస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. వారి నెంబరు నుంచే వైసీపీకి చెందిన ఫోన్ కు మిస్డ్ కాల్ చేయిస్తారు. ఎన్నికలకు ముందు వాయిస్ మెసేజ్ లు పంపించేందుకు వీలుగా ప్రతి ఇంటి నుంచి ఫోన్ నెంబర్లు సేకరించాలని నిర్ణయించారు.అలా రాష్ట్రంలో కోటి 50 లక్షల మంది నెంబర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం ఓ పార్టీ సేకరించడం నేరం. అయినా ప్రభుత్వం మొండిగా వాలంటీర్లకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.
మొత్తంగా, ప్రభుత్వ పథకాలను అడ్డుపెట్టి వాలంటీర్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పలువురు మంత్రుల ప్రకటనలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు. చంద్రబాబు మరలా సీఎం అయితే ముందుగా పీకేసేది వాలంటీర్లనేనని, అందుకే మనమే చంద్రబాబు మరలా సీఎం కాకుండా అడ్డుకోవాలని గతంలో జరిగిన వాలంటీర్ల సమావేశంలో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.ఇలా వారిని భయపెట్టి, పథకాల ముసుగులో పార్టీ ప్రచారానికి సన్నద్ధం చేస్తోంది.